తుపాకీ భుజాన మోసిన మల్లు స్వరాజ్యం ప్రత్యేక ఇంటర్వ్యూ పార్ట్ 2

తెలంగాణ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు.

First Published Mar 19, 2022, 11:59 PM IST | Last Updated Mar 19, 2022, 11:59 PM IST

తెలంగాణ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు.ఆమె వయసు 91  సంవత్సరాలు. ఆమె జమీందారు కుటుంబంలో జన్మించినా .. 12 ఏళ్లకే  పోరుబాట పట్టారు. 16 ఏళ్లకే భూమి, భుక్తి, విముక్తి కోసం తుపాకీ చేతబట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. భూస్వాములు, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. తన భర్త మల్లు వెంకట నర్సింహా రెడ్డి, సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి‌తో తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకున్నారు. ఆ పోరాటంలో మహిళా కమాండర్‌గా పనిచేసిన మల్లు స్వరాజ్యం తలపై నిజాం ప్రభుత్వం అప్పట్లోనే 10 వేల రూపాయల రివార్డు ప్రకటించింది.  ఆమె ఏసియా నెట్ న్యూస్ కి ఎక్స్ క్లూసివ్ ఇచ్చిన ఇంటర్వ్యూ  మరొక్కసారి మీకోసం...