ఏసీబీ వలలో అవినీతి చేప ... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వేములవాడ కమిషనర్
సిరిసిల్ల : ప్రభుత్వం వేలకు వేలు జీతాలు ఇస్తున్న ప్రజల నుండి లంచాలు స్వీకరిస్తుంటారు కొందరు అవినీతి ప్రభుత్వాధికారులు.
సిరిసిల్ల : ప్రభుత్వం వేలకు వేలు జీతాలు ఇస్తున్న ప్రజల నుండి లంచాలు స్వీకరిస్తుంటారు కొందరు అవినీతి ప్రభుత్వాధికారులు. ఇలా ఓ కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమీషనర్ శ్యాంసుందర్ రావు. ఓ కాంట్రాక్ట్ పొడిగింపు కోసం కాంట్రాక్టర్ కు మున్సిపల్ కమీషనర్ లంచం డిమాండ్ చేసాడు. అయితే లంచమివ్వడానికి ఇష్టపడని సదరు కాంట్రాక్టర్ ఏసిబిని ఆశ్రయించాడు. దీంతో ఏసిబి డిఎస్పీ భద్రయ్య నేతృత్వంలోని ఓ బృందం రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కమీషనర్ పట్టుకున్నారు.