Asianet News TeluguAsianet News Telugu

Vikunta Ekadasi : ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరిన భక్తులు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలయాలు కళకళలాడుతున్నాయి. వేకువజాము నుండే భారీ ఎత్తున భక్తులు ఉత్తరద్వార దర్శనం కోసం దేవాలయాలకు పోటెత్తారు. 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలయాలు కళకళలాడుతున్నాయి. వేకువజాము నుండే భారీ ఎత్తున భక్తులు ఉత్తరద్వార దర్శనం కోసం దేవాలయాలకు పోటెత్తారు. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో, స్వయంభూ క్షేత్రమైన మహానందిలో కూర్మ రూప అలంకారంలో, నరసింహస్వామి ఉద్భవించి నడయాడిన ప్రాంతమైన అహోబిలంలో, మంగళగిరిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారంగుండాలక్ష్మీ నరసింహ స్వామి వారు దర్శనమిచ్చారు. పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.