అన్నదాతలను నిండాముంచిన అకాల వర్షం... తడిసిముద్దయిన ధాన్యం ...

కరీంనగర్ జిల్లాలో రాత్రి వర్షం ఒక్కసారిగా దించికొట్టింది. చేతికొచ్చిన పంట నేల కొరికింది. 

First Published May 1, 2023, 3:10 PM IST | Last Updated May 1, 2023, 3:10 PM IST

కరీంనగర్ జిల్లాలో రాత్రి వర్షం ఒక్కసారిగా దించికొట్టింది. చేతికొచ్చిన పంట నేల కొరికింది. ఐకేపీ లో ఉన్న ధాన్యం నీటి పాలైంది. దీంతో రైతన్నలు లబోదిబోమంటూ బోరున విలపిస్తున్నారు. మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్, గన్నేరువరం, బెజ్జంకి, శంకరపట్నం , మానకొండూర్ మండలాల్లో వందల ఎకరాల వరి పంట అకాల వర్షానికి నేలకొరిగింది. ఐకేపీ లో ఉన్న ధాన్యం నీటి పాలైంది.  దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో వైపు ఐకెపి లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు . తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.