టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు నిరుద్యోగుల సెగ

తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని మానకొండూరులో ఎమ్మెల్యే రసమయిని నిరుద్యోగులు అడ్డుకున్నారు. 

First Published Mar 27, 2021, 3:04 PM IST | Last Updated Mar 27, 2021, 3:04 PM IST

తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని మానకొండూరులో ఎమ్మెల్యే రసమయిని నిరుద్యోగులు అడ్డుకున్నారు. మానకొండూరు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద నిరుద్యోగులు రాష్ట్రంలో పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని, లక్షా 90 వేల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ  ఆయనను అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆందోళనకు దిగినవారిని ఎబీవీపీ కార్యకర్తలుగా చెబుతున్నారు.