పెద్దపల్లి జిల్లాలో ఉద్రిక్తత... చెరువు కోసం గ్రామాల మధ్య యుద్దవాతావరణం

పెద్దపల్లి: చెరువు మట్టి తరలింపు రెండు గ్రామాల్లో చిచ్చురేపిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

First Published Jun 1, 2022, 3:08 PM IST | Last Updated Jun 1, 2022, 3:08 PM IST

పెద్దపల్లి: చెరువు మట్టి తరలింపు రెండు గ్రామాల్లో చిచ్చురేపిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దపల్లి మండలంలోని పచ్చర్లకుంట చెరువు తమదంటే తమదని బొంపల్లి,  అప్పన్నపేట ప్రజలు వాదిస్తుండటంతో వివాదం రేగింది. ఈ క్రమంలోనే చెరువు నుండి మట్టిని బొంపల్లి గ్రామ పంచాయితీ తరలిస్తుండగా అప్పన్నపేట ముదిరాజ్ కులస్తులు అడ్డుకున్నారు. తరతరాలుగా వస్తున్న మత్స్య సంపదను నాశనంచేస్తూ బొంపల్లి గ్రామపంచాయితీ పాలకవర్గం చెరువు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోని మట్టి టిప్పర్లను అడ్డుకొని ఆందోళనకు దిగారు. కానీ బొంపల్లి సర్పంచ్ అరికెల్ల లక్ష్మయ్య మాత్రం పచ్చర్లచెరువు తమ గ్రామానిదేనని... ఇందుకు సంబంధించిన ఆదారాలు కూడా వున్నాయంటూ పత్రాలు చూపిస్తున్నారు.