మానేరు వాగులో తాత మనుమడు గల్లంతు...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ తాత మనుమడు  మానేరు వాగులో పడి గల్లంతయ్యారు. 

First Published Jul 3, 2020, 10:41 AM IST | Last Updated Jul 3, 2020, 10:41 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ తాత మనుమడు  మానేరు వాగులో పడి గల్లంతయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరావుపేట మండల కేంద్రంలో ఒగ్గు మల్లయ్య(65) తన మనుమడు అఖిరేష్ నందన్(9)తో కలిసి పొలం వద్దకు వెళ్లాడు.  పొలం దగ్గరున్న మానేరు వాగులో మోటర్ వద్ద నాచు తీస్తుండగా ప్రమాదవశాత్తు  జారి వాగులో పడి గల్లంతయ్యారు. ఎంత సేపైనా వారిద్దరూ బయటకు రాకపోవడంతో అక్కడే ఉన్న మరో మనవడు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో  సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.