మెట్ పల్లిలో విషాదం... తమ్ముడి అంత్యక్రియల్లో అన్న మృతి
జగిత్యాల : తమ్ముడి మృతిని తట్టుకోలేక స్మశానవాటికలోనే అన్న కూడా కుప్పకూలి ప్రాణాలు వదిలిన విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
జగిత్యాల : తమ్ముడి మృతిని తట్టుకోలేక స్మశానవాటికలోనే అన్న కూడా కుప్పకూలి ప్రాణాలు వదిలిన విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా ఒకేసారి చేతికందివచ్చిన ఇద్దరు కొడుకులను ఒకేసారి కోల్పోయిన ఆ తల్లిదండ్రుల శోకం ఇతరులనూ కన్నీరు పెట్టిస్తోంది.
మెట్ పల్లి పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన బోగ నాగభూషణం టెంట్ హౌస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ముగ్గురు కొడుకులు. అయితే ఆదివారం మధ్యాహ్నం రెండో కుమారుడు శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందాడు. తమ్ముడి మృతిని తట్టుకోలేకపోయిన పెద్దవాడు సచిన్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో తమ్ముడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్మశానికి తీసుకెళ్లగా సచిన్ అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఒకేసారి ఇద్దరు అన్నదమ్ముల మృతితో ఆ కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో మెట్ పల్లిలో విషాదం నెలకొంది.