భారత్ బయోటెక్ సిఎండితో తెలంగాణ సీఎస్ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ భారత్ బయోటెక్ సిఎండి కృష్ణా ఎల్లాతో సమావేశమయ్యారు. 

First Published Apr 27, 2021, 5:18 PM IST | Last Updated Apr 27, 2021, 5:18 PM IST

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ భారత్ బయోటెక్ సిఎండి కృష్ణా ఎల్లాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావు  కోవిడ్19 వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించాలని నిర్ణయించారని తెలిపారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక డోసులను సరఫరా చేయడానికి ప్రాధాన్యతనివ్వాలని బయోటెక్ సిఎండిని కోరారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక వ్యాక్సిన్లు ఇవ్వటానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, భారత్ బయోటెక్ డైరెక్టర్ డా. సాయి ప్రసాద్ లు పాల్గొన్నారు.