ఉపఎన్నికల్లో సీపీఐ మద్దతుకోరిన టీఆర్ఎస్ (వీడియో)
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు నివ్వాలని trs పార్లమెంటరీ పార్టీ నేత కె .కేశవ రావు సీపీఐ నేతలను కోరారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగినట్టు తెలిపారు. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో సీపీఐ పోటీ చేయడం లేదు కాబట్టి తమపార్టీకి మద్దతు ఇవ్వాలని కోరామన్నారు.
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు నివ్వాలని trs పార్లమెంటరీ పార్టీ నేత కె .కేశవ రావు సీపీఐ నేతలను కోరారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగినట్టు తెలిపారు. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో సీపీఐ పోటీ చేయడం లేదు కాబట్టి తమపార్టీకి మద్దతు ఇవ్వాలని కోరామన్నారు. టీఆర్ఎస్ తో కలిసి తెలంగాణ ఉద్యమం లో కలిసి పని చేశామని, ఇప్పటివరకు తాము లేవనెత్తిన ప్రజాసమస్యలమీద టీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మా కేంద్ర నాయకత్వంతో చర్చలు జరిపి ఒకటవ తేదీ వరకు హుజూర్ నగర్ ఉపఎన్నికలో సీపీఐ పార్టీ అనుసరించే వైఖరి తెలియజేస్తామని తెలిపారు.