కేటీఆర్ పర్యటన... పోలీస్ స్టేషన్లోనే బిజెపి నాయకులపై టీఆర్ఎస్ శ్రేణుల దాడి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇల్లంతకుంట మండల కేంద్రానికి విచ్చేసిన కేటీఆర్ ను బీజేపీ, ఏబీవీపీ, కాంగ్రెస్ నాయకులు అడ్డుకున ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆగ్రహంతో ఊగిపోయిన టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు తరలించిన బిజెపి కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఓ కారును ధ్వంసం చేశారు. అంతకంతకూ పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసు బలగాలు కావాలంటూ ఎస్సై ఉన్నతాధికారులను కోరాడు.