Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయాల్లో బిజెపి నెంబర్ వన్...: ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ముజీబుద్దీన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక బిజెపి పై విరుచుకుపడ్డారు.

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ముజీబుద్దీన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక బిజెపి పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో నెంబర్ వన్ అయితే బిజెపి అబద్దాలు చెప్పడంలో నెంబర్ వన్ అని కవిత ఎద్దేవా చేసారు. మాయ మాటలు చెప్పడంలో, దొంగ వాగ్దానాలు చెయ్యడంలో. ఫేక్ సర్టిఫికేట్లు ఇయ్యడంలో, ఫేక్ ఫొటోలు సోషల్ మీడియాల పెట్టడంలో, వాట్పప్ యూనివర్సిటీలో, మతాల మధ్య చిచ్చు పెట్టడంలో, రైతులను మోసం చేయడంలో, పేదలపై బారం మోపడంలో, బ్యాంకులను ముంచినోళ్లకు వేల కోట్ల రుణాలు ఇవ్వడంలో,  దేశ సంపదను అమ్మడంలో నంబర్ వన్ బీజేపీ అని సెటైర్లు విసిరారు.