మోడీ పై అనుచిత వ్యాఖ్యలు... రసమయి పై నిరసనల వెల్లువ
ప్రధాని నరేంద్ర మోడీ పై మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రాజీవ్ రహదారి పై బిజెపి నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రసమయి దిష్టి బొమ్మ దగ్ధం చేసేందుకు బీజేపీ నాయకులు యత్నించగా.. ఎల్ఎండి పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు పై మండిపడ్డారు. రా రైస్ తప్ప.. మోడీ వరి ధాన్యం కొనుగోలు చేయమని ఎక్కడా చెప్పుకోలేదన్నారు. మిల్లర్లతో కుమ్మకై.. వారి లాభం కోసం కేసిఆర్ నీచపు రాజకీయాలకు పాల్పడుతున్న ట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రసమయి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.