ఇదేంటని ప్రశ్నిస్తే: ఓ వ్యక్తిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన.. కార్యకర్తల దాడి

 రైతులకు మద్దతుగా నిలుస్తూ ఇవాళ(మంగళవారం) జరుగుతున్న భారత్ బంద్ లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొంటున్నారు.

First Published Dec 8, 2020, 11:54 AM IST | Last Updated Dec 8, 2020, 12:05 PM IST

రైతులకు మద్దతుగా నిలుస్తూ ఇవాళ(మంగళవారం) జరుగుతున్న భారత్ బంద్ లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొంటున్నారు. ఇలా హైదరాబాద్ లో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా బంద్ కు మద్దతుగా అనుచరులు, కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లిలో బారీకేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో తీవ్ర  ఇబ్బందులకు గురయిన శేరిలింగంపల్లి వాసులు ఇదేంటని ఎమ్మెల్యే గాంధీని నిలదీశారు. ఇలా ప్రశ్నించిన ఓ వ్యక్తిపట్ల ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు. అతడు చెప్పేది వినకుండా తోసేయగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అతడిపై దాడిచేసినంత పని చేశారు. అతన్ని అంరూ కలిసి తోసివేశారు.