Asianet News TeluguAsianet News Telugu

బిజెపి Vs టీఆర్ఎస్... తెలంగాణవ్యాప్తంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం

హైదరాబాద్: పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ అమరవీరుల ప్రాణత్యాగాలను అవమానించేలా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది.

హైదరాబాద్: పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ అమరవీరుల ప్రాణత్యాగాలను అవమానించేలా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ(బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు టీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు జరిగాయి. సూర్యాపేటలో నల్ల జెండాలు, నల్ల షర్టులు ధరించి టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గోదావరిఖని చౌరస్తాలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. 

Video Top Stories