నోముల భగత్ రాకతో... జానారెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత
నల్గొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
నల్గొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి స్వగ్రామం అనుములలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ప్రచారానికి వెళ్లగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఒంటరిగా వున్న సమయంలో తమ నాయకున్ని టీఆర్ఎస్ శ్రేణులు ఇబ్బంది కలిగించాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు భగత్ ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఇలా ఇరుపార్టీల కార్యకర్తలు ఒక్కచోటికి చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయగా వారితో జానారెడ్డి తరనయుడు జయవీర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.