నల్గొండ జిల్లాలో కుప్పకూలిన ట్రైనీ విమానం

నల్గొండ జిల్లాలో ట్రైనీ విమానం కుప్పకూలింది. పెద్దవూర మండలం తుంగతుర్తిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

First Published Feb 26, 2022, 1:32 PM IST | Last Updated Feb 26, 2022, 1:32 PM IST

నల్గొండ జిల్లాలో ట్రైనీ విమానం కుప్పకూలింది. పెద్దవూర మండలం తుంగతుర్తిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్, ట్రైనీ పైలట్ మృతిచెందారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నట్టుగా సమాచారం. పొలాలకు మధ్యలో హెలికాప్టర్‌ కుప్పకూలడంతో అక్కడికి సమీపంలో ఉన్న కూలీలు, రైతులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. హెలికాప్టర్ కూలుతున్న దృశ్యాలను గమనించిన అక్కడివారు.. దూరంగా పరుగులు తీశారు.  ప్రమాదం జరిగిన సమయంలో ట్రైనీ విమానం వేగం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా వారు స్థానికులు తెలిపారు.  అయితే  కుప్పకూలడానికి కారణాలను అధికారులు పరిశీలన తర్వాతే వెల్లడికానుంది.  ఇక, కుప్పకూలిన విమానం ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీకి చెందినదిగా గుర్తించారు.   ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. శిక్షణలో ఉన్న విమానం కుప్పకూలినట్టుగా స్థానికులు సమాచారం అందినట్టుగా తెలిపారు. ఫ్లైట్‌లో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించినట్టుగా వెల్లడించారు. లోపల ఇంకెవరైనా ఉన్నారో చూడాల్సి ఉందన్నారు. మిగిలిన వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించారు.