తెలంగాణ డిజిపికి ఫోన్ చేసి... హుటాహుటిన ఖమ్మం బయలుదేరిన రేవంత్

హైదరాబాద్ : తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఖమ్మంకు బయలుదేరారు.

First Published Jul 2, 2023, 12:48 PM IST | Last Updated Jul 2, 2023, 1:54 PM IST

హైదరాబాద్ : తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హుటాహుటిన ఖమ్మంకు బయలుదేరారు. భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ల చేరిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జనగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ సభకోసం భారీ జనసమీకరణ చేస్తుండగా పోలీసులు వాహనాలను అడ్డుకుంటున్నారని రేవంత్ కు కొందరు కాంగ్రెస్ నాయకులు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే డిజిపితో  మాట్లాడిన రేవంత్ హైదరాబాద్ నుండి ఖమ్మం బయలుదేరారు. పోలీసుల తీరుపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.