గంగవ్వ ప్రేమకు రేవంత్ ఫిదా... కన్నతల్లి గుర్తొచ్చిందంటూ టిపిసిసి చీఫ్ ఎమోషన్
కరీంనగర్ :గంగవ్వ... తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. 'మై విలేజ్ షో' యూట్యూబ్ చానల్ ద్వారా పరిచయమై... సినిమాల్లో నటిస్తూ, ఇంటర్వ్యూలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది గంగవ్వ.
కరీంనగర్ :గంగవ్వ... తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. 'మై విలేజ్ షో' యూట్యూబ్ చానల్ ద్వారా పరిచయమై... సినిమాల్లో నటిస్తూ, ఇంటర్వ్యూలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది గంగవ్వ. ఇలా తెలంగాణ పల్లెటూరి యాసతో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకునే గంగవ్వ తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసింది. గంగవ్వ తెచ్చిన మిర్చిబజ్జీలను రేవంత్ చాలా ఇష్టంగా తిన్నారు. గంగవ్వ సరదాగా ముచ్చటించడమే కాదు రంది పడకు బిడ్డా.. అంటూ అమ్మలా ఆప్యాయతను పంచడంతో రేవంత్ ఎమోషన్ అయ్యారు.
గంగవ్వను కలిసిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రేవంత్ ఎమోషన్ కామెంట్స్ చేసారు. ''గంగవ్వ! తెలంగాణకు పరిచయం అక్కరలేని అవ్వ… ప్రపంచానికి తనొక సెలబ్రిటీ. నాకు మాత్రం ప్రేమను పంచిన అమ్మ. నా కోసం ఆప్యాయంగా… నాకిష్టమైన మిర్చీ బజ్జీ తెచ్చి… తను చూపించిన ప్రేమ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది.“యాత్ర”లో జనం కష్టాలు, బాధలు నేరుగా చూస్తున్నా… నా అనుభవాలను నా తల్లితో ఇలాగే ముచ్చటించే వాడిని. తల్లిని గుర్తు చేసిన గంగవ్వను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను'' అంటూ రేవంత్ ట్వీట్ చేసారు.