మద్యంషాపులు తెరుస్తున్నారంటూ నకిలీ జీవో..సన్నీ అరెస్ట్..
మందుషాపులు తెరుస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ జీవో అంటూ ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
మందుషాపులు తెరుస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ జీవో అంటూ ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఇది ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇలా నకిలీ జీవో ప్రచారం చేసిన వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఉప్పల్ లోని విజయపురి కాలనీకి చెందిన శనీష్ కుమార్ అలియాస్ సన్నీగా గుర్తించారు.