నేటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మార్చి 19 నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులంతా ఒకేసారి రాకుండా, గుంపులు గుంపులుగా ఉండకుండా చర్యలు చేపట్టారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. గతంలో మాదిరిగా గ్రేస్ పిరియడ్ ఏదీ ఉండదని, అలాగని ఒక నిమిషం నిబంధన కూడా లేదని అధికారులు తెలిపారు.