ఊపిరాడ్తలేదు డాడీ.. గుండె ఆగింది.. బాయ్ డాడీ..
తెలంగాణలో ఓ యువకుడు చనిపోయే ముందు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలంగాణలో ఓ యువకుడు చనిపోయే ముందు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నేనేం చెప్పిన డాడీ.. చంపేస్తారు డాడీ. పోతే రిటన్ రాను డాడీ అని చెప్పిన గదా. ఊపిరి ఆడడం లేదంటే కూడా చెప్తే వినకుండా ఆక్సిజన్ బంద్ చేశారు. బతిమిలాడి బతిమిలాడి సాలు సాలు అయితుంది. ఇప్పటికి మూడు గంటలు అయింది డాడీ. నాకు ఊపిరి అడతలేదు. గుండె ఆగిపోయింది. ఊపిరి ఒక్కటే కొట్టుకుంటుంది డాడీ. బాయ్ డాడీ బాయ్. అందరికీ బాయ్ డాడీ.’ అంటున్న ఆ యువకుడి ఆవేదన కంటనీరు పెట్టిస్తోంది. మేడ్చల్ కు చెందిన ఈ యువకుడు 24వ తేదీన జ్వరంతో చెస్ట్ హాస్పిటల్ లో చేరాడు. జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడిని ఛాతి ఆసుపత్రిలో చేర్చగా, 26 వ తేదీ వరకు ఆక్సిజన్ అందించారని, ఆక్సిజన్ మాస్క్ తీసేసిన తరువాత ఊపిరాడక కుమారుడు మరణించాడని తండ్రి పేర్కొన్నాడు.