సెంటిమెంట్ ఖేల్ ఖతమ్: కేసీఆర్ కు చుక్కలే... (వీడియో)

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడానికి ముఖ్య కారణం తెలంగాణ సెంటిమెంట్ అనే బ్రహ్మాస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగించడం. చంద్రబాబు ఇక్కడ పోటీకి దిగడం, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో ప్రజలు కెసిఆర్ కు రెఫరెండం గా కన్నా తెలంగాణకు రెఫరెండం గా ఈ ఎన్నికను భావించి ఓట్లు వేశారు.

First Published Oct 16, 2019, 7:29 PM IST | Last Updated Oct 16, 2019, 7:29 PM IST

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడానికి ముఖ్య కారణం తెలంగాణ సెంటిమెంట్ అనే బ్రహ్మాస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగించడం. చంద్రబాబు ఇక్కడ పోటీకి దిగడం, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో ప్రజలు కెసిఆర్ కు రెఫరెండం గా కన్నా తెలంగాణకు రెఫరెండం గా ఈ ఎన్నికను భావించి ఓట్లు వేశారు. 

ఇప్పుడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ బ్యాక్ సీట్లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ వైఖరి, కెసిఆర్ పాలనే గీటురాయిగా ప్రజలు కెసిఆర్ కు మార్కులేయబోతున్నారనే విషయం తేటతెల్లమయింది. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కెసిఆర్ కింది నుండి నేల జారిపోతుందా అనే అనుమానం కలుగుతుంది.