ఖైరతాబాద్ లో భారీ ట్రాఫిక్ జాం.. కారణమిదే..
కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ల బోర్డర్ టాక్స్ లు యేడాదిపాటు రద్దు చేయాలని, కోరుతూ తెలంగాణ స్టేట్ క్యాబ్స్ అండ్ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది.
కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ల బోర్డర్ టాక్స్ లు యేడాదిపాటు రద్దు చేయాలని, కోరుతూ తెలంగాణ స్టేట్ క్యాబ్స్ అండ్ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. వివరాల్లోకి వెడితే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద తెలంగాణ స్టేట్ క్యాబ్స్ అండ్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ బోర్డర్ టాక్స్ ల రద్దుతో పాటు, తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ పర్మిషన్ ఇవ్వాలని ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రైవేట్ బస్సులు ఖైరతాబాద్ కు చేరుకుని, రోడ్డుకి ఇరువైపులా నిలిపివేయడంతో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి ధర్నా చేస్తున్న డ్రైవర్లను అరెస్ట్ చేశారు.