కవిత, తెలంగాణ మంత్రుల ర్యాలీలు, బైఠాయింపులు
బిజేపి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు.
బిజేపి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల నిర్మల్ పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కడ్తాల్ గ్రామం వద్ద జాతీయ రహదారి 44 పై రైతులతో కలిసి దర్నాలో పాల్గొన్నారు.