Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణపై ప్రధాని అనుచిత వ్యాఖ్యలు...హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల ఆందోళన

హైదరాబాద్: పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. 

హైదరాబాద్: పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆందోళనకు దిగగా తాజాగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ రావు ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరసన చేపట్టారు. తెలంగాణపై చేసిన కామెంట్స్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని... రాష్ట్ర ప్రజలకు మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలని న్యాయవాదులు డిమాండ్ చేసారు. నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రధాని దిష్టిబొమ్మను న్యాయవాదులు దహనం చేసారు.