వాయువేగంతో తెలంగాణకు ఆక్సిజన్... ఒడిషాకు బయలుదేరిన యుద్ద విమానం

హైదరాబాద్: తెలంగాణలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను నివారించడానికి కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 

First Published Apr 23, 2021, 1:43 PM IST | Last Updated Apr 23, 2021, 1:43 PM IST

హైదరాబాద్: తెలంగాణలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను నివారించడానికి కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశా నుంచి భారీగా ఆక్సిజన్ ను తెప్పించే ప్రయత్నాలు జరగుతున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంతో తీవ్రమైన ఆక్సిజన్ కొరత వున్న నేపథ్యంలో ఒడిషానుండి వాయువేగంతో ఆక్సిజన్ ను తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో విమానాల్లో ఆక్సిజన్ ను తెప్పించడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశాకు ఆక్సిజన్ ట్యాంకర్లను తీసుకుని విమానాలు బయలుదేరాయి.