స్పీకర్, మండలి ఛైర్మన్‌లను కలిసిన హరీశ్
2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టారు.
2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఉదయం ఇంటి నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకున్న మంత్రి హరీశ్ రావు.. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరికీ హరీశ్ బడ్జెట్ ప్రతులను అందజేశారు. అలాగే శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి బడ్జెట్ ప్రతులున్న బ్రీఫ్ కేసును అందజేసి ఆల్‌ది బెస్ట్ చెప్పారు.