తెలంగాణలో కాంగ్రెస్ నేతల అరెస్టులు...జల దీక్షలు భగ్నం...
తెలంగాణలో ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపట్టేందుకు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్టు చేసి అడ్డుకుంటున్నారు.
తెలంగాణలో ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపట్టేందుకు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్టు చేసి అడ్డుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్షను పోలీసులు భగ్నం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని, పెద్దపల్లిలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్
గారిని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్భంధించారు.