Asianet News TeluguAsianet News Telugu

వృక్షమాత తిమ్మక్కను మించిన దేశభక్తులెవ్వరూ లేరు...: సీఎం కేసీఆర్

హైదరాబాద్: అభివృద్ది పేరుతో, వ్యక్తిగత స్వార్థంతో మనమంతా ప్రకృతిని నాశనం చేస్తుంటే ఆమె మాత్రం నిస్వార్థంగా ప్రకృతిసేవ చేస్తోంది. 

హైదరాబాద్: అభివృద్ది పేరుతో, వ్యక్తిగత స్వార్థంతో మనమంతా ప్రకృతిని నాశనం చేస్తుంటే ఆమె మాత్రం నిస్వార్థంగా ప్రకృతిసేవ చేస్తోంది. 111 సంవత్సరాల వయసులోనూ అలుపెరగకుండా మొక్కలు పెంచుతూ భవిష్యత్ తరాలకు వృక్షసంపదను అందించే బృహత్తర కార్యం చేస్తున్న 'వ‌ృక్షమాత' సాలుమారద తిమ్మక్కను తెలంగాణ సీఎం కేసీఆర్ సన్మానించారు. కర్ణాటకకు చెందిన దమ్మక్క ఇవాళ హైదరాబాద్ కు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమెను ప్రగతిభవన్ కు ఆహ్వానించిన ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు.  వృక్షమాతగా పేరుపొందిన తిమ్మక్క తెలంగాణ ప్రజలందరికి స్పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మొక్కలు నాటడం అంటే కార్యక్రమం కాదని.. మనల్ని, మన భవిష్యత్ తరాలను బ్రతికించే మార్గమని ముఖ్యమంత్రి అన్నారు. ఆ బాధ్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని.. తిమ్మక్క మరింత కాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అనంతరం ఎంపీ జోగినిపల్లి సంతోష్ తో కలిసి తిమ్మకు ప్రగతి భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.