మోదీ ఇలాకాలో కేసీఆర్ క్రేజ్... గుజరాత్ లో వెలిసిన కేసీఆర్ భర్త్ డే హోర్డింగ్స్

సూరత్: రేపే(పిబ్రవరి 17) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. 

First Published Feb 16, 2022, 5:49 PM IST | Last Updated Feb 16, 2022, 5:49 PM IST

సూరత్: రేపే(పిబ్రవరి 17) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. తమ ప్రియతమ నాయకుడి పుట్టినరోజున ఘనంగా జరిపేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్దమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సీఎంకు భర్త్ డే విషెస్ తెలుపుతూ భారీ కటౌట్లు,హోర్టింగ్స్ వెలిసారు. అయితే ఈ హోర్డింగ్ లు కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్ లోని సూరత్ నగరంలోనూ కేసీఆర్ పుట్టినరోజు భారీ హోర్డింగ్స్, ప్లెక్సీలు వెలిసాయి. ఇప్పటికే  ప్రధానితో ఢీ అంటే ఢీ కి సిద్దమయిన కేసీఆర్ హోర్డింగ్స్ సూరత్ లో వెలియడం రాజకీయంగా ప్రాధాన్యత  సంతరించుకుంది.