ఆలయంలో పూజలు, అడవిలో మొక్కలు... కీసరలో ఘనంగా కేసీఆర్ భర్త్ డే వేడుకలు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి మల్లారెడ్డి, బిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి మల్లారెడ్డి, బిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కీసర ఆలయానికి చేరుకున్న మంత్రి, ఎంపీకి బిఆర్ఎస్ నాయకులు, ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. కేసీఆర్ పేరుమీద అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు మల్లారెడ్డి, సంతోష్. వీరిద్దరికి స్వామివారి తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం అందించారు అర్చకులు. ఆలయంలో పూజలు ముగిసిన తర్వాత తాను దత్తత తీసుకున్న కీసర అర్బన్ ఎకో పార్క్ అడవిలో మల్లారెడ్డితో కలిసి మొక్కలు నాటారు సంతోష్. అనంతరం స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్.