Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ ఫలితమే తెలంగాణలోనూ రిపీట్..: బండి సంజయ్

జగిత్యాల : గుజరాత్ లాంటి ఫలితమే తెలంగాణలోనూ వస్తుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 

జగిత్యాల : గుజరాత్ లాంటి ఫలితమే తెలంగాణలోనూ వస్తుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఈ కుటుంబ, గడీల పాలనపై చాలా వ్యతిరేకంగా వున్నారు... కాబట్టి గుజరాత్ లో అఖండ విజయం సాధించినట్లే తెలంగాణలోనూ బిజెపి విజయం ఖాయమన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని... ఈ ఏకలింగం టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఏ పనులు కావంటూ బండి సంజయ్ ఎద్దేవా చేసారు. 

 ఎలాంటి ఫలితాలు వస్తాయోనని యావత్ ప్రపంచం దృష్టి గుజరాత్ పై వుందని... అలాంటిచోట బిజెపి ఘనవిజయం సాధించడం సంతోషకరమని సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా, బిజెపి ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేసినా గుజరాత్ ప్రజలు నమ్మలేదన్నారు. ఈ ఫలితంపై దేశంలో అభివృద్ది కోరుకునే ప్రతి భారతీయుడు సంతోషంగా వున్నారని పేర్కొన్నారు. చూడు సీఎం కేసీఆర్... గుజరాత్ ఫలితాలపై నీ స్పందన చెప్పు అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.