Asianet News TeluguAsianet News Telugu

మహాసంగ్రామ పాదయాత్రకు నో పర్మిషన్... బండి సంజయ్ ఇంటివద్ద ఇదీ పరిస్థితి...

కరీంనగర్ :  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఐదోవిడద ప్రజాసంగ్రామ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

కరీంనగర్ :  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఐదోవిడద ప్రజాసంగ్రామ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని సున్నితమైన బైంసా పట్టణం నుండి సంజయ్ పాదయాత్రకు సిద్దమవగా శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఇప్పటికే బహిరంగ సభకు అన్నిఏర్పాట్లు పూర్తిచేసుకుని ముఖ్య అతిథిగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర పడ్నవిస్ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా బిజెపి సిద్దం చేసింది. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితిలో బైంసా నుండే పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్న సంజయ్ ఆదివారం రాత్రే కరీంనగర్ నుండి బయలుదేరాడు. మార్గమధ్యలో జగిత్యాల వద్ద ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఆందోళనకర వాతావరణం నెలకొంది. పోలీసులు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకుని తిరిగి కరీంనగర్ కు తరలించారు. ఆయన ఇంటివద్ద పోలీసులు భారీగా మొహరించారు. సోమవారం మధ్యాహ్నం వరకు పోలీసుల అనుమతి కోసం వేచిచూస్తానని... అప్పటికీ అనుమతివ్వకుంటే ఏం చేయాలో నిర్ణయిస్తామని బండి సంజయ్ తెలిపారు.