కేసీఆర్ కుటుంబ కమీషన్ల కోసమే... బయ్యారం స్టీల్ ప్లాంట్ ఆగింది : బండి సంజయ్ సంచలనం

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం బయ్యారం స్టీల్ ప్యాక్టరీ ఏర్పాటుకు సంసిద్దంగా వున్నా కేసీఆర్ సహకరించడం లేదని తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.

First Published Feb 21, 2023, 11:15 AM IST | Last Updated Feb 21, 2023, 11:15 AM IST

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం బయ్యారం స్టీల్ ప్యాక్టరీ ఏర్పాటుకు సంసిద్దంగా వున్నా కేసీఆర్ సహకరించడం లేదని తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ పెడితే కమీషన్లు రావు... అందుకే ప్రైవేట్ సంస్ధలను బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆహ్వానిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే జేయస్‌డబ్ల్యూ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ ను  మహారాష్ట్రకు వెళ్లి మంత్రి కేటీఆర్ కలిసారని... తమ కమీషన్ల కోసం బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని కోరారని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పాలించినంత కాలం తెలంగాణకు స్టీల్ ప్లాంట్ రాదు... ఆ కుటుంబానికి కమీషన్లు రావు కాబట్టి సహకరించరని అన్నారు.  బయ్యారం ఫ్యాక్టరీకి సంబంధించి మీ విధివిధానాలేంటని కేంద్రాన్ని ఒకాయన ఆర్టిఎ ద్వారా అడిగితే కేసీఆర్ సర్కార్ అసలురంగు బయటపడిందని సంజయ్ అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు సార్లు లేఖ రాసినట్లు... ఫిజిబిలిటి, డిపిఆర్ ఇవ్వాలని అడిగినట్లుగా కేంద్రం లిఖితపూర్వకంగా తెలిపిందన్నారు. ఇలా కేసీఆర్ కుటుంబ కమీషన్ల వల్లే స్టీల్ ప్లాట్ ఏర్పాటు ఆగిందని బండి సంజయ్ పేర్కొన్నారు.