డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణకు మేలు: ఎంపీ లక్ష్మణ్ | Asianet News Telugu
డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణకు మేలు జరుగుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో నిర్వహించిన ఓటర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదని... కాంగ్రెస్ మెడలు వంచేది, యువత కలలు నిజం చేసేది బీజేపీ మాత్రమేనని చెప్పారు.