జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ఎజెండా..
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ల ఆధ్వరంలో వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను జీహెచ్ఎంసి ఎన్నికలలో గెలిపిస్తాయని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ల ఆధ్వరంలో వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను జీహెచ్ఎంసి ఎన్నికలలో గెలిపిస్తాయని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆదర్శ నగర్ లో MLA క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశం మొత్తం గర్వపడే విధంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత TRS ప్రభుత్వానిదేనని చెప్పారు.