కరీంనగర్ రోడ్డు ప్రమాదం : ఆ లారీ మంత్రి గంగుల కమలాకర్ దే...ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
కరీంనగర్ జిల్లా, గంగాధర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
కరీంనగర్ జిల్లా, గంగాధర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి 12 గంటల ప్రాంతంలో గ్రానైట్ లారీ ఆటోను ఢీ కొట్టడంతో ఆటోలోని ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారి మృతదేహాలను చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ పరిశీలించారు. ఈ లారీ మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన శ్వేతా గ్రానైట్ కు సంబంధించిన లారీ అని తేలింది. బాధితులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించి, న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.