మున్సిపల్ కమీషనర్ వర్సెస్ బిజెపి లీడర్... నడిరోడ్డుపైనే బూతుపురాణం

సూర్యాపేట: బిజెపి నాయకుడు, ప్రభుత్వ అధికారి నడిరోడ్డుపై బూతులు తిట్టుకుంటూ నానా హంగామా సృష్టించారు. 

First Published Jan 7, 2022, 5:13 PM IST | Last Updated Jan 7, 2022, 5:13 PM IST

సూర్యాపేట: బిజెపి నాయకుడు, ప్రభుత్వ అధికారి నడిరోడ్డుపై బూతులు తిట్టుకుంటూ నానా హంగామా సృష్టించారు. ఆవేశంగా పైపైకి వెళ్లి ఘర్షణకు కూడా సిద్దపడ్డారు. నలుగురికి ఆదర్శంగా వుండాల్సిన రాజకీయ నాయకుడు, ప్రభుత్వ అధికారి ఇలా నడిరోడ్డుపై నానా యాగి చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

సూర్యాపేట పట్టణ మున్సిపల్ కమిషనర్ ను అదే మున్సిపాలిటీ 16వ వార్డు బిజెపి కౌన్సిలర్ చలిగంటి సరిత భర్త వీరేంద్రకు ఎక్కడచెడిందో కానీ ఇవాళ (శుక్రవారం) నడిరోడ్డుపై గొడవకు దిగారు. అందరిముందే ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. నువ్వెంతంటే నువ్వెంత... నువ్వెవడివంటే నువ్వెవడివి అంటూ సవాల్ ప్రతి సవాల్ విసుకున్నారు. అక్కడే