సుల్తానాబాద్ లో హీటెక్కిన పాలిటిక్స్ ... బిఆర్ఎస్ కౌన్సిలర్ల తిరుగుబాటు

పెద్దపల్లి : జగిత్యాల, హుజురాబాద్ మున్సిపాలిటీల ఛైర్ పర్సన్లపై కౌన్సిలర్ల తిరుగుబాటు మరిచిపోకముందే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోనూ అదే పరిస్థితి నెలకొంది. 

First Published Feb 14, 2023, 10:45 AM IST | Last Updated Feb 14, 2023, 10:45 AM IST

పెద్దపల్లి : జగిత్యాల, హుజురాబాద్ మున్సిపాలిటీల ఛైర్ పర్సన్లపై కౌన్సిలర్ల తిరుగుబాటు మరిచిపోకముందే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోనూ అదే పరిస్థితి నెలకొంది. సుల్తానాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ ముత్యం సునీతపై అవిశ్వాసం ప్రకటిస్తూ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కు తీర్మాన పత్రాన్ని అందజేసారు. 12 మంది కౌన్సిలర్లు ఛైర్ పర్సన్ తీరును వ్యతిరేకిస్తూ సంతకాలు చేసిన తీర్మాన పత్రం కలెక్టర్ కు అందజేసారు. సుల్తానాబాద్ మున్సిఫల్ ఛైర్ పర్సన్ గా సునీత కాకుండా ఆమె భర్త రమేష్ వ్యవహరిస్తున్నాడని... తమను కలుపుకుపోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఇక అతడి ఒంటెద్దు పోకడను ఉపేక్షించలేకే అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు కౌన్సిలర్లు తెలిపారు.