తెలంగాణ ఊటీలా సుల్తానాబాద్... పొగమంచులో అందాలు కనువిందు
పెద్దపల్లి : సంక్రాంతి పండగకు ముందు తెలుగురాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.
పెద్దపల్లి : సంక్రాంతి పండగకు ముందు తెలుగురాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తెల్లవారుజామున పొంగమంచు పట్టణాలు, గ్రామాలను కప్పేస్తోంది. సాధారణ ప్రాంతాల్లోనే పరిస్థితి ఇలా వుంటే ఏజన్సీ, కొండలు, అటవీ ప్రాంతాల్లో చలి ఏ స్థాయిలో వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం ఇవాళ తెల్లవారుజామున పొంగమంచులో మరింత అందంగా కనిపించింది. ఇదేమైనా తెలంగాణ ఊటీనా అన్నట్లుగా సుల్తానాబాద్ అందాలు కనువిందు చేసారు. ఉదయం 8 గంటల వరకు సూర్యుడు కనిపించకుండా పొగమంచు కురుస్తూనే వుండటంతో ఆ ఆహ్లాదకర వాతావరణాన్ని పట్టణవాసులు ఎంజాయ్ చేశారు.