Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో మోగిన సమ్మె సైరన్

కరీంనగర్ : కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో సమ్మె సైరన్ మోగింది.  

కరీంనగర్ : కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో సమ్మె సైరన్ మోగింది.  తెల్లవారుజామున సమ్మె ప్రారంభం కావడంతో పల్లె వెలుగుతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే అద్దె బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుండి కరీంనగర్ కు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. విద్యార్థులు కూడా సకాలంలో స్కూళ్లకు చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. నామమాత్రం వేతనాలతో పాటు వేధింపులు కూడా తీవ్ర తీవ్రమయాయమని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే వేతనాలు పెంచడంతోపాటు.. ఆర్టీసీ అధికారులు తమపై చూపుతున్న వివక్ష వీడాలని.. వేధింపులు నిలువరించాలని హయిరింగ్ డ్రైవర్ల డిమాండ్ చేస్తున్నారు. డ్రైవర్ల నిరసనకు సిఐటియు కూడా మద్దతు తెలపడంతో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది.