ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.. సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ జిల్లా, గాంధీ పురం, కల్వల గ్రామాల్లో ఎస్.ఆర్. ఎస్. పి స్టేజ్-1 కెనాల్ లో పూడిక తీత పనులను రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
మహబూబాబాద్ జిల్లా, గాంధీ పురం, కల్వల గ్రామాల్లో ఎస్.ఆర్. ఎస్. పి స్టేజ్-1 కెనాల్ లో పూడిక తీత పనులను రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని సీఎం కేసిఆర్ కేంద్రాన్ని కోరుతున్నారన్నారు. ఇటీవల కరోనా వల్ల పనులు లేక చాలా మంది వలస కూలీలు ఇబ్బంది పడ్డారని అన్నారు. సీఎం కేసిఆర్ అడ్వాన్స్ గా ఆలోచించి కూలీలకు ఉపాధి కల్పించడానికి ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులు గుర్తించి నిర్వహించాలన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 6 గంటలు పని చేస్తే 200 రూ.లకు పైగా ఇస్తారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.ఈ ఉపాధి హామీ పథకం కింద మీ గ్రామాల్లో ఎక్కువ పనులు చేసి గ్రామాలను, వ్యవసాయాన్ని బాగా చేసుకోవాలని కోరుతున్నానన్నారు.