కేసీఆర్ కు కరోనా... రామాలయంలో హరీష్ ప్రత్యేక పూజలు
సిద్దిపేట: కరోనా బారినపడి వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో వుంటూ చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని శ్రీరామచంద్రమూర్తికి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు.
సిద్దిపేట: కరోనా బారినపడి వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో వుంటూ చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని శ్రీరామచంద్రమూర్తికి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని రామాలయంలో హరీష్ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా తన మేనమామ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుండి అతిత్వరలో కోలుకోవాలని స్వామిని కోరుకున్నట్లు హరీష్ తెలిపారు.