అభిజిత్ లగ్నంలో... భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం
భద్రాచలం: భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది.
భద్రాచలం: భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ వేడుక కమనీయంగా సాగింది. సరిగ్గా పన్నెండు గంటలకు జీలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం మాంగళ్యధారణ జరిగింది. ఈ కమనీయ వేడుక రామ భక్తుల్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది.
రాములోరి కల్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు సమర్పించారు. కరోనా మహమ్మారి వల్ల భక్తజనుల సందడి లేకుండానే కల్యాణ వేడుకలను నిర్వహించారు.