అంగరంగ వైభవంగా... భద్రాద్రి రామయ్య ఎదుర్కోలు ఉత్సవం

భద్రాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలు మొదలయ్యాయి. ఇవాళ(మంగళవారం) సీతారామస్వామి ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరిగింది. ఎదుర్కోలు ఉత్సవాన్ని కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు తిలకించారు. రేపు ఉదయం రామాలయంలోని శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది.  నిరాడంబరంగా రామాలయంలో జరుగనున్న శ్రీరామనవమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించనున్నారు. 

First Published Apr 20, 2021, 8:01 PM IST | Last Updated Apr 20, 2021, 8:01 PM IST