రోడ్డుపక్కన వాహనాన్ని ఆపారో ఇక అంతే... హైదరాబాదీలకు ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఎంతలా అభివృద్ది చెందుతుందో ట్రాఫిక్ కష్టాలు కూడా రోజురోజుకు అంతలా పెరిగిపోతున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఎంతలా అభివృద్ది చెందుతుందో ట్రాఫిక్ కష్టాలు కూడా రోజురోజుకు అంతలా పెరిగిపోతున్నాయి. దీంతో ఈ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ రోడ్ల పక్కన చాలాకాలంగా నిలిపివుంచిన వాహనాలను తొలగించే పనిలో పడ్డారు. ఇలాంటి వాహనాలను గుర్తించి 15రోజుల క్రితమే వాటికి నోటిసులు అంటిచారు. అయినప్పటికి తొలగించని వాహనాలను స్వాధీనం చేసుకుని క్రేన్ సాయంతో పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. యజమానులు నిర్దేశిత సమయంలో సరయిన పత్రాలతో వస్తే తిరిగి అప్పగిస్తామని... లేదంటే వేలం వేస్తామని తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ మరికొన్ని రోజులు కొనసాగుతుందని... ఇలా రోడ్లపై నిలిపివుంచిన వాహనాలను వెంటనే తొలగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు యజమానులను హెచ్చరించారు.