హైదరాబాద్ లో విషాదం : క్షమించు నాన్న అంటూ ఉత్తరం రాసి..సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య
హైదరాబాద్, హస్తినాపురం సంతోషిమాత కాలనీలో విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్, హస్తినాపురం సంతోషిమాత కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇబ్రహీంపట్నంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రదీప్ బాగా బతకాలని బిజినెస్ మొదలుపెట్టాడు. అది కాస్తా దెబ్బతినడంతో అప్పులపాలై దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తానొక్కడే చనిపోతే భార్య, పిల్లలు అనాథలవుతారని భార్య స్వాతి, పిల్లలు కళ్యాణ్ కృష్ణ, జయకృష్ణలకు కూడా విషం ఇచ్చి నలుగురూ ఆత్మహత్య చేసుకున్నారు.