తెలంగాణ సచివాలయంలో పాము, భయాందోళనలు
మంగళవారంనాడు తెలంగాణ సచివాలయం (బీఆర్కె భవనం)లో ఓ పాము కలకలం సృష్టించింది.
తెలంగాణ సచివాలయం (బీఆర్కె భవనం)లో ఓ పాము కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి ఉద్యోగులు తెలియజేశారు. సొసైటీ సభ్యులు అక్కడికి చేరుకునే లోపలే పాము భవనం సమీపంలో ఉన్న కలుగులోకి దూరిపోయింది. దాన్ని పట్టుకోవడం వారికి సాధ్యం కాలేదు. ఫైరింజన్ కూడా అక్కడికి చేరుకుంది. కానీ ఫలితం దక్కలేదు.