జనశక్తి పార్టీలోకి రిక్రూట్ మెంట్లు.. ఆరుగురు నక్సల్స్ అరెస్ట్
రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం మండెపల్లి శివారులో ఆరుగురు జనశక్తి రాంచందర్ వర్గం నక్సల్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం మండెపల్లి శివారులో ఆరుగురు జనశక్తి రాంచందర్ వర్గం నక్సల్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రెండు 8ఎంఎం రివాల్వర్ లు లెటర్ ప్యాడ్స్, చందా పుస్తకాలు స్వాదీనం చేసుకున్నామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. పార్టీలోకి రిక్రూట్మెంట్లకోసం తిరుగుతున్నారని అందిన పక్కా సమాచారం మేరకు దాడి చేసి అరెస్టులు చేసినట్టు పోలీసులు తెలిపారు.